Revanth Reddy: జపాన్ చేరుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బృందం

Telangana CM Revanth Reddy Arrives in Japan for Investment Drive
  • వారం రోజుల పాటు జపాన్‌లో పర్యటించనున్న బృందం
  • ఆతిథ్య విందు ఇచ్చిన భారత రాయబారి
  • రేపు సోని గ్రూప్ సహా వివిధ సంస్థలతో భేటీ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం జపాన్ చేరుకుంది. వారం రోజుల పాటు ఈ బృందం జపాన్‌లో పర్యటించనుంది. జపాన్‌లోని భారత రాయబారి శింబు జార్జ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఇతర అధికారులకు ఆతిథ్య విందు ఏర్పాటు చేశారు. జపాన్ రాజధాని టోక్యోలోని వందేళ్ల నాటి ఇండియా హౌజ్‌లో జరిగిన ఈ విందులో రేవంత్ రెడ్డితో పాటు పలువురు తమిళనాడు ఎంపీలు పాల్గొన్నారు.

రేపు టోక్యోలో సోని గ్రూప్, జపాన్ ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్ ఏజెన్సీ, జపాన్ బయో ఇండస్ట్రీ అసోసియేషన్‌తో సహా వివిధ సంస్థలతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. గురువారం సాయంత్రం రాష్ట్ర బృందం తొషిబా ఫ్యాక్టరీని సందర్శించనుంది.
Revanth Reddy
Telangana CM
Japan Visit
Japan Investment
Tokyo
Sony Group
Japan International Cooperation Agency
Japan Bio Industry Association
Toshiba
India-Japan Relations

More Telugu News