Vincy Sony Aloisius: షూటింగ్ జరిగినన్ని రోజులు ఒక హీరో నన్ను ఎంతో ఇబ్బంది పెట్టాడు: మలయాళ నటి

Malayalam Actress Vincy Sony Aloisius Accuses Hero of Harassment
  • ఒక హీరో ఎంతో అసభ్యకరంగా ప్రవర్తించాడన్న విన్సీ అలోషియస్
  • తన ముందే బట్టలు మార్చుకోవాలని ఇబ్బంది పెట్టేవాడని మండిపాటు
  • ఆ హీరో ఎవరో అందరికీ తెలుసని వ్యాఖ్య
మలయాళ సినీ నటి విన్సీ సోనీ అలోషియస్ చేసిన వ్యాఖ్యలు మల్లూవుడ్ ను షేక్ చేస్తున్నాయి. ఒక సినిమా షూటింగ్ సందర్భంగా హీరో తనతో ఎంతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ హీరో షూటింగ్ సమయంలో డ్రగ్స్ తీసుకునేవాడని... తనతో అనుచితంగా ప్రవర్తించేవాడని చెప్పారు. 

ఆయన ముందే దుస్తులు మార్చుకోవాలని తనను ఇబ్బంది పెట్టేవాడని... అందరి ముందే ఈ మాటలు మాట్లాడేవాడని విన్సీ తెలిపారు. తన జీవితంలో ఇది ఒక అసహ్యకరమైన ఘటన అని చెప్పారు. షూటింగ్ జరిగినన్ని రోజులు తనను ఎంతో ఇబ్బంది పెట్టాడని తెలిపారు. డ్రగ్స్ అలవాటు ఉన్న నటులతో కలిసి నటించకూడదని ఆ తర్వాత నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. తాను తీసుకున్న నిర్ణయం కారణంగా తనకు సినిమాల్లో ఎక్కువ అవకాశాలు రాకపోవచ్చని... అయినా, తాను ఎదుర్కొన్న చేదు అనుభవం గురించి బహిరంగంగా చెబుతున్నానని అన్నారు. తనతో అలా ప్రవర్తించిన హీరో ఎవరో అందరికీ తెలుసని... కానీ, ఎవరూ స్పందించరని చెప్పారు.
Vincy Sony Aloisius
Malayalam Actress
Malywood
Sexual Harassment
Drug Abuse
Film Industry
Actor Misconduct
On-set Harassment
Bollywood News
South Indian Cinema

More Telugu News