Indian Stock Market: వరుసగా మూడోరోజు లాభపడ్డ స్టాక్ మార్కెట్లు

- రెపో రేటును ఆర్బీఐ మరింత తగ్గిస్తుందనే అంచనాలు
- 309 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 119 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడోరోజు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో ఈ ఉదయం ఫ్లాట్ గా ప్రారంభమైన మన సూచీలు ఆ తర్వాత రాణించాయి. బ్యాంకింగ్ సూచీ మార్కెట్లను ముందుండి నడిపించింది. రెపో రేటును ఆర్బీఐ మరింత తగ్గించవచ్చనే అంచనాలతో బ్యాంక్ స్టాక్స్ రాణించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 309 పాయింట్ల లాభంతో 7,044కి పెరిగింది. నిఫ్టీ 119 పాయింట్లు పుంజుకుని 23,447 వద్ద స్థిరపడింది. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 85.67గా ఉంది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (7.12%) యాక్సిస్ బ్యాంక్ (4.36%), అదాని పోర్ట్స్ (1.81%), ఏషియన్ పెయింట్ (1.75%), భారతి ఎయిర్ టెల్ (1.35%).
టాప్ లూజర్స్:
మారుతి (-1.51%), ఇన్ఫోసిస్ (-1.00%), టాటా మోటార్స్ (-0.92%), ఎల్ అండ్ టీ (-0.90%), ఎన్టీపీసీ (-0.88%).