Secunderabad Railway Station: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫాంలు విడతలవారీగా మూసివేత!

Secunderabad Railway Station Platforms to Close in Phases for Modernization
షార్ట్స్‌లో చూడండి
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫాంలను విడతల వారీగా మూసివేయనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులు కొనసాగుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో 60 రైళ్లను ఇతర స్టేషన్లకు మార్చారు. అలాగే, ప్లాట్‌ఫాంలను నేటి నుంచి మూసివేస్తున్నట్లు ప్రకటించారు.

ఈ రోజు నుంచి 5, 6 ప్లాట్‌ఫాంలను 13 రోజుల పాటు, ఆ తర్వాత 3, 4 ప్లాట్‌ఫాంలను మరో 50 రోజుల పాటు మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు. సికింద్రాబాద్ నుంచి చర్లపల్లి, కాచిగూడ, నాంపల్లి టర్మినళ్లకు 30 రైళ్లను దారి మళ్లించగా, ఇతర టర్మినల్స్ నుంచి చర్లపల్లి స్టేషన్‌కు 8 రైళ్లను మార్చినట్లు అధికారులు పేర్కొన్నారు.
Go Back to Shorts
Secunderabad Railway Station
Platform Closure
Modernization Work
Secunderabad Railway Station platforms
South Central Railway
Train Diversions
Secunderabad Station Updates
Railway modernization
Platform renovation

More Telugu News