Pat Cummins: కమిన్స్ కు ఫ్యామిలీ పెయింటింగ్ ను గిఫ్ట్ గా ఇచ్చిన వీరాభిమాని

Pat Cummins Receives Unique Family Painting Gift from Fan
 
ఐపీఎల్ జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కు అభిమాని నుంచి అపురూపమైన కానుక లభించింది. పాములపాటి ఆదిత్య అనే యువకుడికి కమిన్స్ అంటే వల్లమాలిన అభిమానం. అందుకే కమిన్స్ ఫ్యామిలీ పెయింటింగ్ వేసి తీసుకొచ్చాడు. దాన్ని తన ఆరాధ్య క్రికెటర్ కు బహూకరించాడు. 

ఆ పెయింటింగ్ ను చూసి వావ్ అంటూ కమిన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఇది నా కోసమేనా అంటూ ఆ వీరాభిమానిని అడిగాడు. చాలా బాగా గీశావు అంటూ ఆదిత్యను అభినందించాడు. ఆ అభిమానికి కృతజ్ఞతలు తెలియజేశాడు. దీనికి సంబంధించిన వీడియోను ఆరెంజ్ ఆర్మీ సోషల్ మీడియాలో పంచుకుంది.
Pat Cummins
Sunrisers Hyderabad
IPL
Fan Gift
Painting
Family Portrait
Cricket
Orange Army
Pamulapati Aditya

More Telugu News