Mumbai Indians: 205 కొట్టారు సరే... ఈ స్కోరును ముంబయి కాపాడుకోగలదా?

Mumbai Indians Score 205 Against Delhi Capitals Can They Defend
  • ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్
  • ఢిల్లీ క్యాపిటల్స్ × ముంబయి ఇండియన్స్
  • రాణించిన ముంబయి టాపార్డర్
ఐపీఎల్ తాజా సీజన్ లో చెత్తగా ఆడుతున్న జట్లలో ముంబయి ఇండియన్స్ ఒకటి. 5 మ్యాచ్ లు ఆడి 4 ఓటములతో పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో కొనసాగుతున్న ఈ దిగ్గజ జట్టు ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్ తో ఆడుతోంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ముంబయి ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 205 పరుగులు చేసింది. 

రోహిత్ శర్మ (18), కెప్టెన్ హార్దిక పాండ్యా (2) మినహా మిగతా టాపార్డర్ బ్యాటర్లంతా రాణించారు. ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ 25 బంతుల్లో 41... సూర్యకుమార్ యాదవ్ 28 బంతుల్లో 40... తిలక్ వర్మ 33 బంతుల్లో 59... నమన్ ధీర్ 17 బంతుల్లో 38 (నాటౌట్) పరుగులు చేశారు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో విప్రజ్ నిగమ్ 2, కుల్దీప్ యాదవ్ 2, ముఖేశ్ కుమార్ 1 వికెట్ తీశారు. 

ఈ టోర్నీలో ఓటమన్నదే లేకుండా దూసుకుపోతున్న ఢిల్లీ క్యాపిటల్స్ ను నిలువరించడానికి ముంబయి జట్టు సాధించిన 205 పరుగుల స్కోరు సరిపోతుందా అన్నదే ప్రశ్న.
Mumbai Indians
Delhi Capitals
IPL 2023
Cricket
Rohit Sharma
Suryakumar Yadav
Tilak Varma
Arun Jaitley Stadium
IPL Match
Twenty20

More Telugu News