Chhattisgarh: ఊర్లోకి వచ్చిన ఎలుగుబంటికి గ్రామస్థుల చిత్రహింసలు

Village Residents Brutally Torture Stray Bear in Chhattisgarh
  • ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో ఘటన
  • దారి తప్పి గ్రామంలోకి వచ్చిన ఎలుగును బంధించిన గ్రామస్థులు
  • ఆపై నోరు విరిచి, గోళ్లు తొలగించి దారుణం
దారి తప్పి గ్రామంలోకి వచ్చిన ఓ ఎలుగుబంటికి గ్రామస్థులు నరకం చూపించారు. దానిని చిత్రహింసలకు గురిచేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో జరిగిందీ ఘటన. గ్రామంలోకి వచ్చిన ఎలుగుబంటిని బంధించిన గ్రామస్థులు దానిపై దాడిచేశారు. దాని నోటిని విరిచేశారు. కాలి గోళ్లను తొలగించారు. అది నొప్పితో విలవిల్లాడతున్నా విడిచిపెట్టకుండా దారుణానికి పాల్పడ్డారు. బాధ భరించలేని ఎలుగుబంటి చివరికి ప్రాణాలు విడిచింది. 

ఇందుకు సబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన అటవీశాఖ నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. నిందితుల ఫొటోలను విడుదల చేసింది. వారి ఆచూకీ తెలిపిన వారికి రూ. 10 వేల నజరానా ప్రకటించింది. ఎలుగుబంటి విషయంలో గ్రామస్థులు దారుణంగా ప్రవర్తించారని అటవీశాఖ చీఫ్ కన్జర్వేటర్ ఆర్‌సీ దుగ్గ పేర్కొన్నారు. దానిని చిత్రహింసలకు గురిచేసిన వ్యక్తులను పట్టుకుంటామని, కఠిన శిక్ష తప్పదని తెలిపారు.
Chhattisgarh
Sukma District
Animal Cruelty
Forest Department
Viral Video
Wildlife Crime
Bear Torture
India
Animal Abuse
Wildlife Protection

More Telugu News