Kalyan Ram: అలాంటి చిత్రమే మా అర్జున్ సన్నాఫ్ వైజయంతి: కల్యాణ్ రామ్

- హైదరాబాద్‌లో జరిగిన 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్
- ప్రేక్షకుల మనసులకు హత్తుకుని ఉండిపోయే సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయన్న కల్యాణ్ రామ్
- ఈ సినిమాను చూసిన ప్రతి ఒక్కరూ చాలా రోజుల పాటు గుర్తు పెట్టుకుంటారని వెల్లడి
ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో కల్యాణ్ రామ్ నటించిన చిత్రం అర్జున్ సన్నాఫ్ వైజయంతి. సీనియర్ నటి, ఎమ్మెల్సీ విజయశాంతి ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో శనివారం చిత్ర ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ విచ్చేశారు. ఈ ఈవెంట్‌లో హీరో కల్యాణ్ రామ్ మాట్లాడుతూ.. నటులుగా మేము చాలా చిత్రాల్లో నటిస్తుంటాం. మీరు చాలా సినిమాలు చూస్తుంటారు. వాటిలో హిట్లు, ఫ్లాప్‌లు అన్నీ ఉంటాయి. కానీ థియేటర్ నుంచి బయటకు వచ్చాక కూడా మీ మనసులకు హత్తుకుని ఉండిపోయే సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి. అలాంటి చిత్రమే మా 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' అని అన్నారు. ఈ సినిమాను చూసిన ప్రతి ఒక్కరూ చాలా రోజుల పాటు గుర్తు పెట్టుకుంటారని స్పష్టం చేశారు.