33 మందితో వైసీపీ రాజకీయ సలహా సంఘం... కన్వీనర్ గా సజ్జల
- పీఏసీని ప్రకటించిన జగన్
- వైసీపీ కీలకనేతలందరికీ ఈ కమిటీలో స్థానం
- పీఏసీలో శాశ్వత ఆహ్వానితులుగా పార్టీ రీజినల్ కోఆర్డినేటర్లు
ఈ రాజకీయ సలహాల కమిటీకి పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి కన్వీనర్ గా వ్యవహరిస్తారు. ఈ మేరకు వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి సభ్యుల జాబితాలతో కూడిన ప్రకటన విడుదలైంది. కొందరిని తప్పించి... దాదాపు వైసీపీలో కీలక నేతలందరికీ ఈ కమిటీలో స్థానం లభించింది. ఈ పీఏసీలో పార్టీ రీజినల్ కోఆర్డినేటర్లు శాశ్వత ఆహ్వానితులుగా ఉంటారు.
