Noufal: కరోనా పేషెంట్ పై అత్యాచారం చేసిన అంబులెన్స్ డ్రైవర్ కు జీవిత ఖైదు

Life Imprisonment for Ambulance Driver Who Raped Covid 19 Patient
  • 19 ఏళ్ల కరోనా పేషెంట్ పై అంబులెన్స్ లో అత్యాచారం
  • 2020 సెప్టెంబర్ 5న జరిగిన దారుణ ఘటన
  • కోవిడ్ సెంటర్ కు తీసుకెళుతూ నిర్మానుష్య ప్రాంతంలో అత్యాచారం
ఎన్ని చట్టాలు వచ్చినా కామాంధులు చెలరేగిపోతూనే ఉన్నారు. అభంశుభం తెలియని చిన్నారుల దగ్గర నుంచి వృద్ధ మహిళల వరకు ఎవరినీ వదలడం లేదు. కోవిడ్ సమయంలో తిరువనంతపురంలో జరిగిన ఓ దారుణ ఘటన అప్పట్లో అందరినీ కలచివేసింది. రోగులను కాపాడాల్సిన ఓ అంబులెన్స్ డ్రైవర్ కరోనా పేషెంట్ పై అత్యాచారం చేశాడు. ఈ దారుణ ఘటన 2020 సెప్టెంబర్ 5వ తేదీన జరిగింది.

కరోనా సోకిన ఒక అమ్మాయి (19)ని అంబులెన్స్ లో తరలిస్తూ... ఒక నిర్మానుష్య ప్రాంతంలో వాహనాన్ని అంబులెన్స్ డ్రైవర్ నౌఫాల్ ఆపాడు. కరోనా రోగి అనే కనికరం కూడా లేకుండా ఆమెపై అత్యాచారం చేశాడు. తప్పు జరిగిపోయిందని, ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని బాధితురాలిని నౌఫాల్ కోరాడు. అయితే, అదే రోజున కోవిడ్ సెంటర్ లోని అధికారులకు తనపై జరిగిన అత్యాచారం గురించి ఆమె తెలియజేసింది. 

ఈ విషయాన్ని కోవిడ్ సెంటర్ అధికారులు వెంటనే పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. నిమిషాల వ్యవధిలోనే నౌఫాల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. నౌఫాల్ పై అత్యాచారం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. 

నౌఫాల్ గతంలో కూడా ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడినట్టు పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసును విచారించిన పట్టణమిట్ట ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు నిన్న సంచలన తీర్పును వెలువరించింది. నౌఫాల్ కు జీవిత ఖైదు విధించడంతో పాటు రూ. 1.08 లక్షల జరిమానా విధించింది. కోర్టు తీర్పు పట్ల అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Noufal
Ambulance Driver
Rape
Life Imprisonment
Kerala
Covid-19 Patient
Sexual Assault
Crime
Thiruvananthapuram
SC ST Atrocity

More Telugu News