Raja Singh: రాజాసింగ్‌తో బండి సంజయ్ సమావేశం.. 'కత్తర్ హిందూ' అంటూ ప్రశంసలు

Raja Singh Meets Bandi Sanjay BJP Leader Praised as Kattar Hindu

  • హనుమాన్ దేవాలయంలో పూజల అనంతరం ఇరువురి భేటీ
  • హిందూ ధర్మం కోసం పోరాడే 'కత్తర్ హిందూ' అని ప్రశంస
  • హిందూ సంస్కృతిపై దాడి జరిగిన ప్రతిసారి రాజాసింగ్ ప్రాణాలకు తెగించి పోరాడారని కితాబు

కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌తో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాజాసింగ్‌పై బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజాసింగ్ బీజేపీలో చాలా సీనియర్ నాయకుడని, హిందూ ధర్మం కోసం పోరాడే 'కత్తర్ హిందువు' (వీర హిందువు) అని ప్రశంసించారు. హిందూ సంస్కృతిపై దాడి జరిగిన ప్రతిసారి రాజాసింగ్ తన ప్రాణాలకు తెగించి పోరాడారని కొనియాడారు.

పాతబస్తీలోని ఆకాశ్‌పురి హనుమాన్ దేవాలయంలో పూజలు చేసిన అనంతరం రాజాసింగ్‌తో బండి సంజయ్ సమావేశమయ్యారు. రాజాసింగ్ ఇటీవల తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి లక్ష్యంగా విమర్శలు చేశారు. ఈ క్రమంలో ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. బీజేపీ కార్యక్రమాలకు అందుబాటులో ఉండాలని రాజాసింగ్ కు సంజయ్ సూచించారు. సమస్యలు మెల్లిగా సర్దుకుంటాయని అన్నారు.

Raja Singh
Bandi Sanjay
BJP
Telangana BJP
Goshamahal MLA
Hindu leader
Kishan Reddy
Telangana Politics
India Politics
BJP Meeting
  • Loading...

More Telugu News