చేబ్రోలు కిరణ్ ను నారా లోకేశ్ పోషిస్తున్నారు: అంబటి రాంబాబు
- వైసీపీ నేతలపై చాలా కాలంగా కిరణ్ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారన్న అంబటి
- గోరంట్ల మాధవ్ ను కలిసేందుకు నల్లపాడు పీఎస్ కు వచ్చిన మాజీ మంత్రి
- మాధవ్ ను పోలీసులు ఎలా ట్రీట్ చేశారో తెలుసుకునేందుకు వచ్చానన్న అంబటి
మాధవ్ ను గత రాత్రి పోలీసులు ఎలా ట్రీట్ చేశారో తెలుసుకునేందుకు వచ్చానని అంబటి తెలిపారు. నల్లపాడు పీఎస్ నుంచి నగరపాలెం పీఎస్ కు మాధవ్ ను తరలిస్తామని పోలీసులు చెప్పారని వెల్లడించారు. కోర్టు ముందు ప్రవేశపెట్టే సమయంలో ఆయనను కలిసేందుకు అవకాశం కల్పిస్తామని చెప్పారని తెలిపారు.