‘హరిహ‌ర వీర‌మ‌ల్లు’పై కీల‌క అప్‌డేట్‌.. కన్ఫార్మ్‌గా ఆ రోజే థియేట‌ర్ల‌లోకి మూవీ!

Pawan Kalyans Hari Hara Veera Mallu Dubbing and VFX are in full swing
పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్ హీరోగా జ్యోతి కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న‌ ‘హరిహ‌ర వీర‌మ‌ల్లు’పై కీల‌క అప్‌డేట్ వ‌చ్చింది. ఈ మూవీ పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా కొన‌సాగుతున్న‌ట్లు మేక‌ర్స్ 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా ప్ర‌క‌టించారు. రీరికార్డింగ్‌, డ‌బ్బింగ్‌, వీఎఫ్ఎక్స్ ప‌నులు జెట్ స్పీడ్‌తో కొన‌సాగుతున్నాయ‌ని తెలిపారు. 

ఈ వేస‌విలో ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు బిగ్గెస్ట్ సినిమాటిక్ అద్భుతాన్ని తీసుకొస్తున్నామ‌ని పేర్కొన్నారు. మే 9న పెద్ద స్క్రీన్లపై వీర‌మ‌ల్లు ఆగ‌మ‌నం అంటూ ట్వీట్ చేశారు. కాగా, ఈ సినిమాను మే 09న‌ ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్న‌ట్లు ఇప్ప‌టికే చిత్ర‌బృందం ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. 

ఇక‌ పిరియాడిక‌ల్ బ్యాక్‌డ్రాప్‌తో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా రెండు భాగాలుగా రానుంది. మొద‌టి పార్ట్ ‘హరిహర వీరమల్లు పార్ట్‌: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా... బాలీవుడ్ నటులు బాబీ డియోల్, అర్జున్ రాంపాల్‌, న‌ర్గీస్ ఫ‌క్రీ త‌దిత‌రులు ఇత‌ర‌ కీలక పాత్రల్లో క‌నిపించ‌నున్నారు. లెజెండరీ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎంఎం కీర‌వాణి ఈ చిత్రానికి సంగీతం, బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్‌ అందిస్తున్నారు.
Go Back to Shorts
Hari Hara Veera Mallu
Pawan Kalyan
Jyothi Krishna
Tollywood
Telugu Cinema
Release Date
May 9th
Bollywood Actors
MM Keeravaani
Nidhi Agerwal

More Telugu News