Xi Jinping: అమెరికా ఎఫెక్ట్... ఇండియాతో సంబంధాలు పెంచుకునేందుకు రెడీ అన్న జిన్ పింగ్

Chinas Xi Jinping Announces Strategic Partnership with India
  • చైనాపై భారీ టారిఫ్ లు విధించిన డొనాల్డ్ ట్రంప్
  • భారత్ కు దగ్గరయ్యేందుకు రెడీ అవుతున్న చైనా
  • భారత్ తో కలిసి పని చేసేందుకు సిద్ధమన్న జిన్ పింగ్
పొరుగుదేశం చైనాతో భారత్ కు ఎప్పుడూ వివాదం కొనసాగుతూనే ఉంటుంది. పాకిస్థాన్ కు అండగా ఉంటూ భారత్ ను ఇబ్బంది పెట్టే ప్రయత్నాలను చైనా చేస్తుంటుంది. సరిహద్దుల్లో ఎప్పుడూ ఉద్రిక్తతలను పెంచి పోషిస్తుంటుంది. అయితే, ఇప్పుడు విధిలేని పరిస్థితుల్లో చైనా తన స్టాండ్ ను మార్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీనికి కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. 

చైనాపై ట్రంప్ ఊహించని విధంగా ఏకంగా 125 శాతం ప్రతీకార సుంకాలను విధించారు. దీంతో, చైనాకు భారీ షాక్ తగిలింది. చైనా విధానాలను మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇండియాతో వ్యూహాత్మక సంబంధాలను పెంచుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ సంచలన ప్రకటన చేశారు. 

బీజింగ్ లో జరిగిన ఉన్నతస్థాయి కేంద్ర కమిటీ సమావేశంలో జిన్ పింగ్ మాట్లాడుతూ... భారత్ తో అభిప్రాయ భేదాలను తగ్గించుకుని, సరఫరా వ్యవస్థలను పెంపొందించుకునేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. భారత్ తో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇరు దేశాల మధ్య ఒక మంచి ఉమ్మడి సమాజాన్ని నిర్మిస్తామని చెప్పారు. జిన్ పింగ్ వ్యాఖ్యలపై భారత్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
Xi Jinping
China-India Relations
US-China Trade War
Donald Trump
India-China Strategic Partnership
Beijing
International Relations
Geopolitics
Trade Tariffs

More Telugu News