US Visa: అమెరికా మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం.. సోష‌ల్ మీడియాలో అలాంటి పోస్టులు పెట్టినా నో వీసా!

US Announces Strict Visa Policy Based on Social Media Activity
  • వ‌ల‌స‌ల విష‌యంలో ఉక్కుపాదం మోపుతున్న అమెరికా
  • వ‌ల‌స‌దారుల విష‌యంలో కఠిన నిబంధ‌న‌ల‌ను అమ‌లు చేస్తున్న వైనం
  • సోష‌ల్ మీడియా వేదిక‌గా జాతి వ్య‌తిరేక పోస్టులు పెట్టిన‌ట్టు తేలితే నో వీసా, గ్రీన్‌కార్డ్
డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత నుంచి కీల‌క‌ నిర్ణ‌యాలు తీసుకుంటున్న విష‌యం తెలిసిందే. ప్ర‌ధానంగా వ‌ల‌స‌ల విష‌యంలో ఆయన ఉక్కుపాదం మోపుతున్నారు. వ‌ల‌స‌దారుల విష‌యంలో కఠిన నిబంధ‌న‌ల‌ను అమ‌లు చేస్తున్న యూఎస్ ప్ర‌భుత్వం తాజాగా మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. 

సోష‌ల్ మీడియా వేదిక‌గా జాతి వ్య‌తిరేక పోస్టులు పెట్టిన‌ట్టు తేలితే అలాంటి వారికి వీసాలు, గ్రీన్‌కార్డ్ మంజూరు చేయ‌బోమ‌ని అమెరికా అధికారులు వెల్ల‌డించారు. విద్యార్థి వీసాలు మొద‌లుకొని గ్రీన్‌కార్డ్స్ ద‌ర‌ఖాస్తుదారుల వ‌ర‌కు అంద‌రి సోష‌ల్ మీడియా అకౌంట్ల‌పై నిఘా ఉంచ‌డం జ‌రుగుతుంద‌ని యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేష‌న్ స‌ర్వీసెస్ తెలిపింది. 

అగ్ర‌రాజ్యానికి వ‌చ్చి యూదు వ్య‌తిరేక హింస‌, ఉగ్ర‌వాదాన్ని స‌మ‌ర్థించ‌వ‌చ్చ‌ని భావించే ఎవ‌రైనా మ‌రోసారి ఆలోచించాల‌ని హోంల్యాండ్ సెక్యూరిటీ కార్య‌ద‌ర్శి క్రిస్టీ నొయెమ్ స్ప‌ష్టం చేశారు. ఇలా త‌ప్పుడు పోస్టులు పెట్టిన 300 మందికి గ‌త నెల‌లో వీసాలు క్యాన్సిల్ చేసిన‌ట్లు విదేశాంగ కార్య‌ద‌ర్శి మార్కూ రూబియో వెల్ల‌డించారు. 

అమెరికా పౌరులు కానివారికి అమెరిక‌న్ల‌కు ఉన్నంత హ‌క్కులు లేవ‌న్నారు. వీసాల జారీ లేదా తిర‌స్క‌ర‌ణ అనేది న్యాయ‌మూర్తుల అభీష్టానుసారం కాద‌ని, త‌మ అభిష్టం మేర‌కు ఉంటుంద‌ని రూబియో స్ప‌ష్టం చేశారు. 

ఇక ఉగ్ర‌వాద సంస్థ‌లుగా అమెరికా వ‌ర్గీక‌రించిన హ‌మాస్, పాలస్తీనియ‌న్ ఇస్లామిక్ జిహాద్‌, లెబ‌నాన్ హెజ్‌బొల్లా, యెమెన్ హూతీల వంటి గ్రూపుల‌కు మ‌ద్ద‌తు ఇస్తే.. వాటిని యూదు వ్య‌తిరేక చ‌ర్య‌లుగా భావిస్తామ‌ని అమెరికా తెలిపింది. అలాంటి ఉగ్ర‌కార్యక‌లాపాల‌ను ప్ర‌చారం చేసినా... వాటి గురించి సోష‌ల్ మీడియాలో అనుకూలంగా పోస్టులు పెట్టినా తీవ్ర‌మైన ప‌రిణామాల‌ను ఎదుర్కోవాల్సి ఉంటుంద‌ని హెచ్చ‌రించింది. 


US Visa
Donald Trump
US Visa Policy
Social Media Posts
Immigration
Green Card
Anti-Semitic
Hate Speech
US Citizenship and Immigration Services
Visa Cancellation
Homeland Security

More Telugu News