ఢిల్లీ ఏపీ భవన్ లోని పౌరసరఫరాల శాఖ దుకాణంలో మంత్రి నాదెండ్ల ఆకస్మిక తనిఖీ
- బియ్యం నాణ్యతను పరిశీలించిన మంత్రి నాదెండ్ల
- బియ్యం బస్తా తూకంలో తేడా రావడంతో సిబ్బందిపై ఆగ్రహం
- ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో ఉన్న దుకాణం సీజ్
- ఇకపై ఏపీ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే దుకాణం నడుస్తుందని ప్రకటన
ఏపీ భవన్ లో నెల రోజుల్లో ప్రభుత్వ దుకాణం ఏర్పాటు చేస్తామని మంత్రి అక్కడిక్కడే ప్రకటించారు. ఇకపై ఏపీ భవన్ లోని దుకాణం పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలోనే నడుస్తుందని స్పష్టం చేశారు. ఈ తనిఖీల్లో మంత్రి నాదెండ్లతో పాటు పౌరసరఫరాల శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్, ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ లవ్ అగర్వాల్ కూడా పాల్గొన్నారు.