సంతలో గోధుమ పిండి బస్తా చోరీ చేసిన ఏనుగు.. వీడియో ఇదిగో!
––
ఇదంతా అక్కడే ఉన్న జనం తమ సెల్ ఫోన్ కెమెరాలలో బంధించారు. వీడియోను సోషల్ మీడియాలో పెట్టడంతో అదికాస్తా వైరల్ గా మారింది. హరిద్వార్ సమీపంలోని బహద్రాబాద్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బహద్రాబాద్ పక్కనే రాజాజీ టైగర్ రిజర్వ్ ఉంది. అప్పుడప్పుడు జంతువులు గ్రామంలోకి వచ్చి తిండి కోసం వెతకడం మామూలేనని, అయితే, ఇలా వార సంతలోకి ఏనుగు చొరబడి గోధమ పిండి తినడం మాత్రం ఇదే మొదటిసారి అని గ్రామస్థులు చెబుతున్నారు.