ఐపీఎల్ లో 'కింగ్స్' పోరు... చెన్నైపై టాస్ గెలిచిన పంజాబ్
- చెన్నై సూపర్ కింగ్స్ × పంజాబ్ కింగ్స్
- ఛండీగఢ్ లో మ్యాచ్
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్
రికార్డు స్థాయిలో ఐదు ఐపీఎల్ టైటిళ్లు నెగ్గిన చెన్నై జట్టు ఈ సీజన్ లో దారుణంగా ఆడుతోంది. ఇప్పటిదాకా 4 మ్యాచ్ లు ఆడి ఒక్కదాంట్లోనే గెలిచింది. అందుకే ఇవాళ్టి మ్యాచ్ ను చావోరేవో అన్నట్టుగా తీసుకుని బరిలో దిగుతోంది. మరోవైపు శ్రేయాస్ అయ్యర్ నాయకత్వంలోని పంజాబ్ కింగ్స్ 3 మ్యాచ్ లు ఆడి రెండింట్లో గెలిచి మాంచి ఊపు మీదుంది.