కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తోంటే, మోదీ ఫ్లెక్సీలను వారు చించేస్తున్నారు: బండి సంజయ్
- బియ్యానికి మోదీ ప్రభుత్వమే డబ్బులు ఇస్తోందన్న బండి సంజయ్
- కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పినా అవి మోదీ బియ్యమేనని వ్యాఖ్య
- రేవంత్ రెడ్డి ఫొటో పెట్టుకుంటే అభ్యంతరం లేదన్న బండి సంజయ్
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నర్సంపేటలో బీజేపీ కార్యకర్తలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఉన్న ఫ్లెక్సీని ఏర్పాటు చేస్తే, పోలీసుల సహాయంతో వాటిని తొలగిస్తున్నారని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫొటోను ఏర్పాటు చేసుకుంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, అదే సమయంలో ప్రధానమంత్రి ఫొటోను కూడా పెట్టాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం కాస్త విజ్ఞతతో వ్యవహరించాలని సూచించారు. బియ్యం విషయంలో రాష్ట్రం ప్రభుత్వం వాటా ఎంత ఉందో చెప్పాలని బండి సంజయ్ కోరారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పటి నుంచి లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తూనే ఉందని గుర్తు చేశారు. ఇన్నేళ్లకు ఇప్పుడు సన్న బియ్యం పంపిణీ చేయడం మొదలు పెట్టారని అన్నారు.