Vijay Deverakonda: బాలీవుడ్ పై విజయ్ దేవరకొండ సంచలన వ్యాఖ్యలు

Vijay Deverakondas Sensational Comments on Bollywood
  • బాలీవుడ్ ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటోందన్న విజయ్ దేవరకొండ
  • త్వరలోనే పూర్వ వైభవాన్ని సాధిస్తుందని వ్యాఖ్య
  • బాలీవుడ్ లో ఏర్పడిన లోటును కొత్త దర్శకులు తీరుస్తారన్న విజయ్
కొన్నేళ్లుగా బాలీవుడ్ తన ప్రాభవాన్ని కోల్పోతూ వస్తోంది. చెప్పుకోదగ్గ గొప్ప సినిమాలను బాలీవుడ్ అందించలేకపోతోంది. బాలీవుడ్ స్టార్లు కూడా పెద్ద హిట్లను సాధించలేక పోతున్నారు. ఇదే సమయంలో దక్షిణాది సినిమాలు ఉత్తరాదిని ఊపేస్తున్నాయి. ఈ క్రమంలో బాలీవుడ్ పై సొంత ఇండస్ట్రీలోని ప్రముఖులు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. 

తాజాగా టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాలీవుడ్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ ఇప్పుడు ఇబ్బందులను ఎదుర్కొంటోందని... త్వరలోనే పూర్వ వైభవాన్ని సాధిస్తుందని చెప్పారు. దక్షిణాది సినిమాలకు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా విశేష ఆదరణ లభిస్తోందని అన్నారు. తెలుగు సినీ పరిశ్రమ ఈ స్థాయికి చేరుకోవడం వెనుక ఎంతో మంది శ్రమ, కృషి ఉందని చెప్పారు. 

ఉత్తరాది ప్రేక్షకులు ఇప్పుడు మన సినిమాలను చూసేందుకు ఆసక్తి చూపుతున్నారని... ఒకానొక సమయంలో మన సినిమాలకు ఉత్తరాదిన సరైన గుర్తింపు ఉండేది కాదని అన్నారు. బాలీవుడ్ లో ఇప్పుడు ఒక లోటు ఏర్పడిందని... ఆ లోటును కొత్త దర్శకులు తీరుస్తారని చెప్పారు. కాకపోతే ఆ దర్శకులు ముంబైకి సంబంధం లేకుండా బయటివారే అయి ఉంటారని అనిపిస్తోందని అన్నారు.
Vijay Deverakonda
Bollywood
Tollywood
South Indian Cinema
Hindi Cinema
Indian Cinema
Film Industry
Vijay Deverakonda on Bollywood
Bollywood's decline
Rise of South Indian films

More Telugu News