Penguin Memes: ట్రంప్ పై ఐక్య పోరాటానికి సిద్ధమవుతున్న పెంగ్విన్ లు.. ఫన్నీ మీమ్స్ ఇవిగో!

Penguins Unite Against Trump Hilarious Memes Go Viral

  • పెంగ్విన్ లు మాత్రమే నివసించే దీవిపైనా ట్రంప్ టాక్స్
  • మా వ్యాపారం వేరే చోటుకు మార్చుకుంటామని పెంగ్విన్ లు చెబుతున్నట్లు మీమ్
  • ఉక్రెయిన్ ప్రెసిడెంట్, కెనడా ప్రధానిలతో పోల్చుతూ వ్యంగ్యంగా పోస్టులు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ ల దెబ్బకు పెంగ్విన్ లు వలస వెళుతున్నాయట.. ఇంతే సి పన్నులు వేస్తే తమ వ్యాపారం ఏంకావాలని ఆందోళన చెందుతున్నాయని, తమ వ్యాపారాలను వేరే ఎక్కడికైనా తరలిస్తామని ట్రంప్ తో తెగేసి చెప్పాయట. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారిన మీమ్ లలో ఇదొకటి. ట్రంప్ టారిఫ్ లపై మీమర్స్ ఇలా ఫన్నీ మీమ్ లతో వ్యంగ్యస్త్రాలు సంధిస్తున్నారు. ఇటీవల రష్యాతో యుద్ధం నిలువరించేలా చూడాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ కలిసిన విషయం తెలిసిందే.

అయితే, ఆ సమావేశం రసాభాసగా మారింది. తాము ఆయుధాలు, క్షిపణులు అందించి సహాయం చేసినా జెలెన్ స్కీ అమెరికన్లకు ఒక్కసారి కూడా ధన్యవాదాలు చెప్పలేదని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ విమర్శించారు. ఈ విషయాన్ని టారిఫ్ లకు అన్వయిస్తూ.. ట్రంప్, వాన్స్ లతో పాటు కుర్చీలో కూర్చున్న పెంగ్విన్ తో ఓ మీమ్ క్రియేట్ చేశారు. ట్రంప్ తో భేటీకి సదరు పెంగ్విన్ సూట్ వేసుకుని వెళ్లినా టారిఫ్ లు విధించారంటే బహుశా ఆ పెంగ్విన్ అమెరికన్లకు థ్యాంక్స్ చెప్పలేదేమోనంటూ సెటైర్ వేశారు.

పెంగ్విన్ ల ప్రస్తావన ఎందుకంటే..?
ఆస్ట్రేలియా ఆధీనంలో ఉన్న మెక్ డొనాల్డ్స్ దీవిలో కేవలం పెంగ్విన్ లు మాత్రమే నివసిస్తున్నాయి. గత ఇరవై ఏళ్లలో ఆ దీవికి ఎవరూ వెళ్లలేదు. అలాంటి ప్రాంతానికి కూడా టారిఫ్ లు వర్తిస్తాయని ట్రంప్ చెప్పారట. ఆ దీవి ఆస్ట్రేలియాకు చెందినది కాబట్టి 10 శాతం పన్ను చెల్లించాల్సిందేనని ఆయన అన్నారు. దీంతో మీమర్లు సోషల్ మీడియాలో ట్రంప్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. పెంగ్విన్ లు అన్నీ ఐక్యంగా ట్రంప్ పై పోరాటానికి సిద్ధమవుతున్నట్లు మీమ్ లు తయారుచేసి సోషల్ మీడియాలో పెడుతున్నారు.





Penguin Memes
Trump Tariffs
Social Media Memes
Viral Memes
Political Memes
US Tariffs
Australia
MacDonald Island
Zelensky
  • Loading...

More Telugu News