కేసీఆర్ పై 14 ఏళ్ల నాటి కేసు... కొట్టివేసిన తెలంగాణ హైకోర్టు
- కేసీఆర్ పై 2011లో రైల్ రోకో కేసు
- తెలంగాణ హైకోర్టులో ఊరట
- కేసును కొట్టివేస్తూ తీర్పు వెలువరించిన ఉన్నత న్యాయస్థానం
2011 అక్టోబర్ 15న ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో భాగంగా సికింద్రాబాద్‌లో రైల్ రోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు కేసు నమోదు చేసి పలువురిని అరెస్టు చేశారు. ఈ కేసు ప్రజాప్రతినిధుల కోర్టులో పెండింగ్‌లో ఉండగా, కేసీఆర్ పిలుపు మేరకు రైల్ రోకో చేపట్టారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు తెలిపారు. అయితే, రైల్ రోకో జరిగిన సమయంలో కేసీఆర్ అక్కడ లేరని ఆయన తరఫు న్యాయవాది వాదించారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం, కేసీఆర్‌పై నమోదైన కేసును కొట్టివేస్తూ తీర్పునిచ్చింది.