Sunrisers Hyderabad: కేకేఆర్ తో మ్యాచ్... టాస్ గెలిచిన సన్ రైజర్స్ మ్యాచ్ గెలిచేనా?

- ఐపీఎల్ లో నేడు సన్ రైజర్స్ × కోల్ కతా
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న హైదరాబాద్ టీమ్
- వరుసగా రెండు మ్యాచ్ ల్లో ఓటమిపాలైన సన్ రైజర్స్
- ఎస్ఆర్ హెచ్ తరఫున ఐపీఎల్ అరంగేట్రం చేస్తున్న కమిందు మెండిస్
ఐపీఎల్ 18వ సీజన్ లో తన ప్రస్థానాన్ని అట్టహాసంగా ప్రారంభించిన సన్ రైజర్స్ హైదరాబాద్... వరుసగా రెండు మ్యాచ్ ల్లో ఓడి ఆత్మవిశ్వాసం కోల్పోయింది. తొలి మ్యాచ్ లో రికార్డు స్థాయి స్కోరుతో తన స్థాయికి తగ్గట్టు ఆడిన సన్ రైజర్స్... ఆపై వరుస ఓటములతో డీలాపడింది. ఈ నేపథ్యంలో, ప్యాట్ కమిన్స్ నాయకత్వంలోని సన్ రైజర్స్ జట్టు నేడు కోల్ కతా నైట్ రైడర్స్ తో తలపడుతోంది.
టాస్ గెలిచిన హైదరాబాద్ టీమ్ బౌలింగ్ ఎంచుకుంది. గత రెండు మ్యాచ్ ల్లో మొదట బ్యాటింగ్ చేసినా ఫలితం దక్కకపోవడంతో, కమిన్స్ ఈసారి ఛేజింగ్ కు మొగ్గుచూపినట్టు అర్థమవుతోంది.
సన్ రైజర్స్ ఇప్పటివరకు మూడు మ్యాచ్ లు ఆడి ఒక దాంట్లో గెలిచింది. కేకేఆర్ పరిస్థితి కూడా ఇంతే... ఆ జట్టు కూడా మూడు మ్యాచ్ లు ఆడి ఒక దాంట్లో గెలిచి, రెండింట్లో ఓడింది.
ఈ మ్యాచ్ లో విధ్వంసక ఆటగాడు ట్రావిస్ హెడ్ ఇంపాక్ట్ ప్లేయర్ జాబితాలో ఉన్నాడు. శ్రీలంక సంచలన ఆటగాడు కమిందు మెండిస్ సన్ రైజర్స్ తుదిజట్టులోకి వచ్చాడు. కమిందు మెండిస్ ఈ మ్యాచ్ తో ఐపీఎల్ అరంగేట్రం చేస్తున్నాడు.
సన్ రైజర్స్ హైదరాబాద్
ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీశ్ కుమార్ రెడ్డి, అనికేత్ వర్మ, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), కమిందు మెండిస్, హర్షల్ పటేల్, సిమర్జీత్ సింగ్, మహ్మద్ షమీ, జీషన్ అన్సారీ.
కోల్ కతా నైట్ రైడర్స్
అజింక్యా రహానే (కెప్టెన్), క్వింటన్ డికాక్, సునీల్ నరైన్, వెంకటేశ్ అయ్యర్, రింకూ సింగ్, ఆంగ్ క్రిష్ రఘువంశీ, మొయిన్ అలీ, ఆండ్రీ రసెల్, రమణ్ దీప్ సింగ్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి.