జపాన్ లో భూకంపం... రిక్టర్ స్కేలుపై 6.0 తీవ్రత నమోదు

Japan Hit by 60 Magnitude Earthquake
  • జపాన్ లోని క్యుషు ప్రాంతంలో ప్రకంపనలు
  • స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 7.34 గంటలకు ప్రకంపనలు
  • ప్రస్తుతానికి ఎలాంటి నష్టం లేదన్న అధికారులు
జపాన్‌లోని క్యుషు ప్రాంతంలో ఇవాళ భూకంపం సంభవించింది. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 7.34 గంటలకు ప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేలుపై ఈ భూకంపం తీవ్రత 6.0గా నమోదైంది. దేశంలో సంభవించే భారీ భూకంపాల నష్టాలపై ప్రభుత్వ నివేదిక విడుదలైన కొద్ది రోజులకే భూకంపం చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ భూకంపం ప్రస్తుతానికి ఎలాంటి నష్టం కలిగించలేదని అధికారులు తెలిపారు. ఎలాంటి సునామీ హెచ్చరికలు లేవని వెల్లడించారు. అయితే ఈ భూకంప ప్రభావం జపాన్ రాజధాని టోక్యో వరకు కనిపించింది.

జపాన్ ప్రభుత్వం విడుదల చేసిన నివేదిక ప్రకారం, పసిఫిక్ తీరంలో భారీ భూకంపం సంభవిస్తే 1.81 ట్రిలియన్ డాలర్ల నష్టం వాటిల్లవచ్చు. సునామీల కారణంగా అనేక భవనాలు నేలమట్టం కావచ్చు, దాదాపు 3 లక్షల మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది, లక్షలాది మంది సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లవలసి వస్తుంది. 
Go Back to Shorts
Japan Earthquake
Kyushu Earthquake
Richter Scale 6.0
Pacific Coast Earthquake
Japan Tsunami Warning
Tokyo Earthquake Impact
Earthquake Damage Report
Natural Disaster Japan

More Telugu News