Virat Kohli: నిరాశపరిచిన కోహ్లీ... ఆర్సీబీ 169-8

Kohli Disappoints as RCB Posts 1698 Against Gujarat Titans
  • ఐపీఎల్ లో బెంగళూరు × గుజరాత్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టైటాన్స్
  • 3 వికెట్లతో బెంగళూరును దెబ్బతీసిన సిరాజ్ 
  • కోహ్లీ 7 పరుగులకే అవుట్
ఐపీఎల్ లో ఇవాళ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ ఎంచుకుంది. దాంతో మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 169 పరుగులు చేసింది. స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లీ (7) స్వల్ప స్కోరుకే వెనుదిరిగాడు. మరో ఓపెనర్ విల్ జాక్స్ 14, దేవదత్ పడిక్కల్ 4 పరుగులకే అవుట్ కావడంతో బెంగళూరు జట్టు 35 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. మహ్మద్ సిరాజ్ తన పదునైన పేస్ తో ఆర్సీబీ టాపార్డర్ ను దెబ్బకొట్టాడు. 

కాసేపటికే కెప్టెన్ రజత్ పటిదార్ (12) కూడా పెవిలియన్ చేరాడు. అయితే లియామ్ లివింగ్ స్టన్, వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ జితేశ్ శర్మ దూకుడుగా ఆడుతూ స్కోరుబోర్డును ముందుకు నడిపించారు. లివింగ్ స్టన్ 40 బంతుల్లో 54 పరుగులు చేశాడు. అతడి స్కోరులో 1 ఫోర్, 5 సిక్సులు ఉన్నాయి. జితేశ్ శర్మ 21 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్ కొట్టాడు. 

చివర్లో టిమ్ డేవిడ్ ధాటిగా ఆడడంతో బెంగళూరుకు ఆ మాత్రం స్కోరైనా వచ్చింది. టిమ్ డేవిడ్ 18 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సులతో 32 పరుగులు చేశాడు. కృనాల్ పాండ్యా 5 పరుగులు చేసి అవుటయ్యాడు. 

గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో సిరాజ్ 3 వికెట్లు, సాయి కిశోర్ 2 వికెట్లు, అర్షద్ ఖాన్ 1, ప్రసిద్ధ్ కృష్ణ 1, ఇషాంత్  శర్మ 1 వికెట్ తీశారు.
Virat Kohli
RCB
Gujarat Titans
IPL 2023
Mohammed Siraj
Liam Livingstone
Jitesh Sharma
Tim David
Cricket
Royal Challengers Bangalore

More Telugu News