Swati Sachdeva: స్టాండప్ కమెడియన్ స్వాతి అసభ్యకర వ్యాఖ్యలు

Swati Sachdevas Viral Clip Sparks Outrage on Social Media
  • తల్లితో చేయకూడని సంభాషణ చేసినట్టు పేర్కొన్న స్వాతి సచ్‌దేవా
  • ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాయన్న స్టాండప్ కమెడియన్
  • స్టాండప్ కామెడీ హద్దులు దాటుతోందంటున్న నెటిజన్లు
స్టాండప్ కమెడియన్ స్వాతి సచ్‌దేవా వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లోకి ఎక్కారు. తన తల్లితో చేయకూడని సంభాషణ చేసినట్టు ఓ షోలో ఆమె పేర్కొన్న క్లిప్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాను చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయానని పేర్కొంది. ఆమె వ్యాఖ్యలపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. స్వాతిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రేక్షకులను నవ్వించేందుకు అసభ్యకర విషయాలను ఎంచుకోవడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్టాండప్ కామెడీ హద్దులు దాటుతోందని మండిపడుతున్నారు. 

కాగా,‘ఇండియా గాట్ లాటెంట్’ వేదికగా యూట్యూబర్ రణ్‌వీర్ అల్హాబాదియా ఇటీవల చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి. దీంతో ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి. అలాగే, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండేపై స్టాండప్ కమెడియన్ కుణాల్ కామ్రా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆయనపైనా కేసులు నమోదయ్యాయి. ఇప్పుడీ జాబితాలో స్వాతి సచ్‌దేవా చేరింది.
Swati Sachdeva
Stand-up Comedian
Controversial Remarks
Viral Clip
Social Media
India Got Talent
Ranveer Allahbadia
Kunal Kamra
Eknath Shinde
Offensive Jokes

More Telugu News