Mumbai Indians: టాస్ గెలిచిన ముంబయి ఇండియన్స్... మరి మ్యాచ్ కూడా గెలిచేనా?

Mumbai Indians Win Toss Against Gujarat Titans Can They Win the Match
  • ఐపీఎల్ లో ఇవాళ ముంబయి × గుజరాత్
  • అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మ్యాచ్
  • టాస్ గెలిచి బౌలింగ్  ఎంచుకున్న ముంబయి ఇండియన్స్
ఐపీఎల్ లో ఇవాళ ముంబయి ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ ఢీకొంటున్నాయి. టోర్నీలో ఇప్పటివరకు ముంబయి, గుజరాత్ చెరో మ్యాచ్ ఆడాయి. అయితే ఈ రెండు జట్లు తమ ప్రారంభ మ్యాచ్ లలో ఓడిపోయాయి. దాంతో, గెలుపు బోణీ కొట్టాలని తహతహలాడుతున్నాయి. 

నేడు ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ కు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా నిలుస్తోంది. టాస్ గెలిచిన ముంబయి ఇండియన్స్ బౌలింగ్ ఎంచుకుంది. తొలి మ్యాచ్ కు దూరమైన రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్ కు అందుబాటులోకి రావడం ముంబయి ఇండియన్స్ కు సానుకూలాంశం. ఇరు జట్లలో మ్యాచ్ విన్నర్లకు కొదవలేదు. 

ముంబయి ఇండియన్స్ 
హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, నమన్ ధీర్, మిచెల్ శాంట్నర్, దీపక్ చహర్, ట్రెంట్ బౌల్ట్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, సత్యనారాయణరాజు.

గుజరాత్ టైటాన్స్ 
శుభ్ మాన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), షెర్ఫాన్ రూథర్ ఫోర్డ్, షారుఖ్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయికిశోర్, కగిసో రబాడా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.
Mumbai Indians
Gujarat Titans
Hardik Pandya
IPL 2024
Ahmedabad
Narendra Modi Stadium
Rohit Sharma
Shubman Gill
Cricket Match
T20 Cricket

More Telugu News