Hyderabad: నేడు హైదరాబాద్‌లో ఉదయం నుంచే ట్రాఫిక్ ఆంక్షలు.. కారణమిదే!
- ఈరోజు పవిత్ర రంజాన్ మాసంలో ఆఖరి శుక్రవారం
- మక్కా మసీదులో ప్రత్యేక ప్రార్థనలకు ముస్లింలు సోదరులు భారీగా వచ్చే అవకాశం
- ఈ నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
- చార్మినార్, మదీనా, శాలిబండ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
ఈరోజు పవిత్ర రంజాన్ మాసంలో ఆఖరి శుక్రవారం కావడంతో చార్మినార్ వద్ద ఉన్న మక్కా మసీదులో ముస్లింలు సోదరులు ప్రత్యేక ప్రార్థనలకు భారీ సంఖ్యలో హాజరవుతారు. చార్మినార్ నుంచి మదీనా వరకు ముస్లింలు ప్రార్థన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో పోలీసులు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
ఈ క్రమంలో చార్మినార్, మదీనా, శాలిబండ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు వెల్లడించారు. చార్మినార్ పరిసర ప్రాంతాలకు వచ్చే రోడ్లన్నింటినీ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మూసేస్తున్నారు.
నేటి ట్రాఫిక్ ఆంక్షలు ఇలా..

- చౌక్ మైదాన్ నుంచి చార్మినార్ వైపునకు వచ్చే వాహనాలను కోట్ల అలిజా లేదా మొఘల్‌పురా వద్ద మళ్లించనున్నారు.
- ఈతేబర్ చౌక్ పరిసర ప్రాంతాల నుంచి గుల్జార్ హౌజ్‌కు వచ్చే వాహనాలను మండి మీరాలం మార్కెట్ లేదా బీబీ బజార్ వైపు మళ్లించనున్నారు.
- నాగుల్‌చింత, శాలిబండ వైపు నుంచి చార్మినార్ వచ్చే వాహనాలను హిమ్మత్‌పురా జంక్షన్ వద్ద మళ్లించి హరిబౌలి, వోల్గా హోటల్ టీ జంక్షన్ వైపు మళ్లించనున్నారు.
- మూసాబౌలి నుంచి చార్మినార్ వైపునకు వచ్చే వాహనాలను మోతిగల్లీ వద్ద మళ్లించి ఖిలావత్ గ్రౌండ్, రాజేశ్ మెడికల్ హాల్, ఫతే దర్వాజా రోడ్డు వైపు మళ్లించనున్నారు.