Bill Gates: గేట్స్ ఫౌండేషన్ తో ఒప్పందం అమలుకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం

AP Government Forms Task Force for Gates Foundation Agreement
  • కీలక రంగాల్లో ఏపీ ప్రభుత్వానికి గేట్స్ ఫౌండేషన్ సహకారం
  • ఇటీవల బిల్ గేట్స్ తో సమావేశమై చర్చించిన సీఎం చంద్రబాబు
  • నేడు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ 
కీలక రంగాల్లో సహకారం కోసం ఇటీవల ఏపీ ప్రభుత్వం, బిల్ గేట్స్ ఫౌండేషన్ మధ్య ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు కీలక పరిణామం చోటు చేసుకుంది. గేట్స్ ఫౌండేషన్ తో ఒప్పందం అమలుకు ఏపీ ప్రభుత్వం ఒక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ టాస్క్ ఫోర్స్ లో ఏపీ ప్రభుత్వ ప్రతినిధులు, గేట్స్ ఫౌండేషన్ ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. 

సుపరిపాలన, వ్యవసాయంలో ఏఐ టెక్నాలజీ వినియోగం, వైద్య ఆరోగ్య రంగం, జీవన ప్రమాణాల పెంపుపై ఏపీ ప్రభుత్వం-గేట్స్ ఫౌండేషన్ మధ్య ఒప్పందం కుదిరింది. సీఎం చంద్రబాబు ఇటీవల ఢిల్లీలో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తో సమావేశమై అనేక అంశాలపై లోతుగా చర్చించారు.
Bill Gates
Gates Foundation
Andhra Pradesh Government
Task Force
AP Government
Agriculture
AI Technology
Healthcare
Good Governance
Chandrababu Naidu

More Telugu News