Ryan Parag: ఐపీఎల్‌లో ఆటగాళ్లకు భద్రత కరవు.. ఈ వీడియో చూడండి!

IPL Security Breach Fan Grabs Ryan Parag on the Field
  • రాజస్థాన్-కోల్‌కతా మ్యాచ్‌లో సెక్యూరిటీ ఉల్లంఘన
  • పిచ్‌పైకి దూసుకొచ్చి పరాగ్ కాళ్లు పట్టుకున్న అభిమాని
  • ఈ ఐపీఎల్‌లో ఇది రెండో ఘటన
ఐపీఎల్‌లో ఆటగాళ్ల భద్రతపై అనుమానాలు తలెత్తుతున్నాయి. అభిమానులు తరచూ సెక్యూరిటీని ఛేదించుకుని మైదానంలోకి దూసుకొచ్చి ఆటగాళ్లను కలుసుకోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. తాజాగా, గువాహటిలో రాజస్థాన్-కోల్‌కతా మధ్య జరిగిన మ్యాచ్‌లో భద్రతా పరమైన ఉల్లంఘన చోటుచేసుకుంది. ఓ అభిమాని సెక్యూరిటీ కళ్లు గప్పి రాజస్థాన్ రాయల్స్ స్టాండిన్ కెప్టెన్ రియాన్ పరాగ్ కాళ్లు పట్టుకున్నాడు. కేకేఆర్ ఇన్నింగ్స్ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది.

పరాగ్ బౌలింగ్‌కు సిద్ధమవుతుండగా మైదానంలో ఒక్కసారిగా అరుపులు వినిపించాయి. బ్యాటర్ వెంటనే అప్రమత్తమై పరాగ్‌ను వారించాడు. ఆ వెంటనే పిచ్ పైకి దూసుకొచ్చిన అభిమాని పరాగ్ కాళ్లు పట్టుకున్నాడు. ఆపై అతడిని బలంగా వాటేసుకున్నాడు. ఈ లోగా మైదానంలోకి వచ్చిన సెక్యూరిటీ సిబ్బంది అభిమానిని పట్టుకుని లాక్కెళ్లారు. మైదానంలోకి అభిమాని చొచ్చుకురావడం ఇది రెండోసారి. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో ఓ అభిమాని కోహ్లీ కోసం మైదానంలోకి దూసుకొచ్చాడు. ఐపీఎల్‌లో ఇలా తరచూ భద్రతాపరమైన ఉల్లంఘనలు జరుగుతుండటంతో ఆటగాళ్ల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది.
Ryan Parag
IPL
Player Security
Rajasthan Royals
Kolkata Knight Riders
Guwahati Match
Security Breach
Fan Incident
Cricket
IPL Security Concerns

More Telugu News