వైవీ సుబ్బారెడ్డి ఇంట విషాదం
- వైవీ సుబ్బారెడ్డికి మాతృవియోగం
- ఈ తెల్లవారుజామున కన్నుమూసిన యర్రం పిచ్చమ్మ
- రేపు మేదరమెట్లలో అంత్యక్రియలు
పార్లమెంటు సమావేశాల కోసం ఢిల్లీలో ఉన్న వైవీ సుబ్బారెడ్డి... తల్లి మరణవార్తతో హుటాహుటీన ఒంగోలు బయల్దేరారు. వైవీ తల్లికి రేపు మేదరమెట్లలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. వైసీపీ అధినేత జగన్... యర్రం పిచ్చమ్మ భౌతికకాయానికి నివాళులు అర్పించనున్నారు. వైఎస్... వైవీ సుబ్బారెడ్డి కుటుంబాల మధ్య బంధుత్వం ఉన్న సంగతి తెలిసిందే.