డ్రోన్లతో మహిళలపై నిఘా పెడుతున్న ఇరాన్.. కారణం ఇదే..!
- హిజాబ్ ధరించకుండా బయటకు అడుగుపెడితే అంతే..
- వాహనాల్లోనూ మహిళలు హిజాబ్ ధరించాల్సిందే
- డ్రోన్ల ద్వారా గుర్తించి వాహన యజమానికి హెచ్చరికలు
2022లో హిజాబ్ వ్యతిరేక ఆందోళన చేపట్టిన మహసా అమినిని మోరల్ పోలీసులు అరెస్టు చేయగా.. కస్టడీలో అమిని చనిపోవడం ఇరాన్ ప్రజల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. ఆ తర్వాత ఆందోళనలు మరింత తీవ్రమయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఇరాన్ ప్రత్యేకంగా డ్రోన్లను రంగంలోకి దింపి హిజాబ్ ధరించని మహిళలను కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఆకాశంలో ఎగురుతూ వీధులపై నిఘా పెట్టే ఈ డ్రోన్ల సాయంతో హిజాబ్ ధరించకుండా బయటకు వచ్చే మహిళలను పోలీసులు గుర్తిస్తారు. డ్రోన్ కెమెరాల్లోని ఫేసియల్ రికగ్నిషన్ కెమెరాల ద్వారా మహిళలను గుర్తించి వారి ఫోన్లకు హెచ్చరికలు పంపిస్తారు. వాహనాల్లో మహిళలు హిజాబ్ లేకుండా కనిపిస్తే సదరు వాహనదారుడికి వెంటనే సందేశం పంపించి హెచ్చరిస్తారు. అప్పటికీ వినకుంటే ఆ వాహనాన్ని పోలీసులు సీజ్ చేస్తారని యూఎన్ అధికారులు తెలిపారు.