Rapido: ఫుడ్ డెలివరీ మార్కెట్లోకి ర్యాపిడో ఎంట్రీ !

Rapido in talks to challenge Swiggy and Zomato in food delivery space
  • రెస్టారెంట్ల నిర్వాహకులతో ర్యాపిడో ప్రతినిధుల భేటీ
  • స్విగ్గీ, జొమాటోలకు గట్టి పోటీనిచ్చేందుకు ప్రయత్నాలు
  • 2015 లో ప్రారంభమైన ర్యాపిడో క్యాబ్ సేవలు
  • బైక్ బుకింగ్ సేవలతో మార్కెట్లో పాగా
దేశంలో ప్రముఖ క్యాబ్ బుకింగ్ సేవల సంస్థ ర్యాపిడో త్వరలో ఫుడ్ డెలివరీ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమవుతోందని సమాచారం. ఈ దిశగా ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయని, ర్యాపిడో ప్రతినిధులు పలు రెస్టారెంట్ల యజమానులతో భేటీ అయి కమీషన్ విషయంపై చర్చలు జరిపారని తెలుస్తోంది. రోజురోజుకూ పెరిగుతున్న ఫుడ్ డెలివరీ మార్కెట్ ను ప్రస్తుతం స్విగ్గీ, జొమాటోలు ఏలుతున్నాయి. కమీషన్ల రూపంలో ఈ సంస్థలు వసూలు చేస్తున్న మొత్తాలను గణనీయంగా తగ్గించడం ద్వారా మార్కెట్ పై పట్టు సాధించాలని ర్యాపిడో భావిస్తున్నట్లు సమాచారం.

ప్రస్తుతం ఫుడ్‌ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లలో అమలుచేస్తున్న కమీషన్‌ విధానాన్ని సవాలు చేసే లక్ష్యంతో వ్యాపార ప్రణాళికపై కసరత్తు చేస్తోంది. కాగా, క్యాబ్ బుకింగ్ సేవలతో 2015 లో మార్కెట్లోకి అడుగుపెట్టిన ర్యాపిడో... బైక్ బుకింగ్ సేవలనూ అందిస్తూ మార్కెట్లో నిలదొక్కుకుంది. ఈ విభాగంలో ప్రస్తుతం ర్యాపిడో టాప్ 3లో ఉందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. దేశంలోని వంద నగరాల్లో ర్యాపిడో సేవలందిస్తోంది.
Rapido
food delivery
Swiggy
Zomato
Business News

More Telugu News