Kondapalli Srinivas: తన శాఖ అధికారులపై ఏపీ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆగ్రహం

Minister Kondapalli Srinivas fires on his own ministry officials
  • కొనసాగుతున్న అసెంబ్లీ, మండలి సమావేశాలు
  • అధికారులు నిర్లక్ష్యం వహించారంటూ మంత్రి ఫైర్
  • నేడు మండలిలో తన ప్రశ్న ఉన్నప్పటికీ, అధికారులు జవాబు సిద్ధం చేయలేదని ఆగ్రహం
  • ఎందుకు జవాబు సిద్ధం చేయలేదో రాసివ్వాలంటూ అధికారులకు ఆదేశాలు
ఏపీ అసెంబ్లీ, మండలి సమావేశాలు కొనసాగుతున్న వేళ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఇవాళ తన శాఖ అధికారులపై మండిపడ్డారు. 

నేడు మండలి సమావేశాల లిస్టింగ్స్ లో తన ప్రశ్న ఉన్నప్పటికీ, అధికారులు సమాధానాన్ని సిద్ధం చేయకపోవడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.. మండలి నుంచి బయటికొచ్చి ఏంచేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు సమాధానం ఇవ్వలేకపోయారో లిఖితపూర్వకంగా ఇవ్వండని సదరు అధికారులను ఆదేశించారు.
Kondapalli Srinivas
Officials
AP Legislative Council

More Telugu News