Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి మరోసారి రిమాండ్ పొడిగింపు

Remand for Vallabhaneni Vamsi extended by Vijayawada court
  • సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వల్లభనేని వంశీ
  • నేడు వర్చువల్ విధానంలో జడ్జి ఎదుట హాజరు
  • మార్చి 25 వరకు రిమాండ్ పొడిగింపు
  • ఇప్పటికే టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో రిమాండ్ లో ఉన్న వంశీ
గన్నవరం టీడీపీ ఆఫీసులో పనిచేసే కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి న్యాయస్థానం మరోసారి రిమాండ్ ను పొడిగించింది. వల్లభనేని వంశీని జైలు అధికారులు నేడు వర్చువల్ విధానంలో న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. కోర్టు వంశీకి మార్చి 25 వరకు రిమాండ్ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 

కాగా, గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులోనూ వల్లభనేని వంశీ నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులోనూ ఆయన రిమాండ్ లో ఉన్నారు. ఆయనకు కోర్టు ఈ నెల 15 వరకు రిమాండ్ విధించారు. ఈ కేసులో రిమాండ్ ముగిసిన వెంటనే, ఇదే విధంగా ఆన్ లైన్ పద్ధతిలో వంశీని కోర్టులో హాజరుపరుస్తారని తెలుస్తోంది.
Vallabhaneni Vamsi
Remand
Vijayawada
YSRCP

More Telugu News