Chennai Srivari Temple: చెన్నై శ్రీవారి ఆలయంలో విదేశీ కరెన్సీ దారి మళ్లింపు... టీటీడీ ఉద్యోగి కృష్ణకుమార్ పై వేటు

TTD suspends employee after stolen foreign currency
  • చైన్నైలోని శ్రీవారి ఆలయంలో పరకామణిలో ఉద్యోగి చేతివాటం
  • సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న కృష్ణకుమార్
  • విజిలెన్స్ విచారణలో తప్పు చేసినట్టు తేలిన వైనం 
టీటీడీ దేశవ్యాప్తంగా పలు శ్రీవారి ఆలయాలను నిర్వహిస్తోంది. అయితే చెన్నైలోని ఆలయంలో పరకామణిలో ఓ ఉద్యోగి చేతివాటం ప్రదర్శించినట్టు వెల్లడైంది. ఆ ఉద్యోగి పేరు కృష్ణకుమార్. భక్తులు స్వామివారి హుండీలో విదేశీ కరెన్సీ కూడా వేస్తుంటారు. పరకామణిలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న కృష్ణకుమార్ ఈ విదేశీ కరెన్సీని దారిమళ్లిస్తున్నట్టు గుర్తించారు. 

దీనిపై విజిలెన్స్ విచారణ జరిపించిన టీటీడీ ఈవో శ్యామలరావు... అతడు తప్పు చేసినట్టు నిర్ధారణ కావడంతో సస్పెన్షన్ వేటు వేశారు. కాగా, కృష్ణకుమార్ పెద్ద మొత్తంలో విదేశీ కరెన్సీని దారిమళ్లించినట్టు తెలిసింది.
Chennai Srivari Temple
Employee
Foreign Currency
TTD
Tirumala

More Telugu News