KA Paul: నేను చెప్పినట్టే పవన్ కల్యాణ్ చేశాడు... వర్మకు బుద్ధి లేదు: కేఏ పాల్

KA Paul comments on Varma being ignored in MLC elections
  • పిఠాపురం టీడీపీ ఇన్చార్జి వర్మకు దక్కని ఎమ్మెల్సీ టికెట్
  • చంద్రబాబు, పవన్ మాట నిలబెట్టుకోరని తాను అప్పుడే చెప్పానన్న కేఏ పాల్
  • తెలివైన వాడు ఎవడూ జనసేనలో చేరడని వ్యాఖ్యలు
పిఠాపురం టీడీపీ ఇన్చార్జి ఎస్వీఎస్ఎన్ వర్మకు ఎమ్మెల్సీ టికెట్ దక్కకపోవడంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పందించారు. తాను చెప్పినట్టే పవన్ కల్యాణ్ చేశాడని, ఎమ్మెల్సీని తన అన్న నాగబాబుకు ఇచ్చుకున్నాడని అన్నారు. గత ఎన్నికల సమయంలో, నువ్వు పోటీ చేయకుండా పవన్ కు సహకరించు అని వర్మకు చెప్పారని, ఎమ్మెల్సీ నీకే ఇస్తామని దేవుడి సాక్షిగా  హామీ ఇచ్చారని కేఏ పాల్ వివరించారు. 

"ఆ వర్మ ఏమో... అయ్యా మీ మాట నిలబెట్టుకోండి అంటూ అమరావతిలో పవన్ కల్యాణ్ చుట్టూ, చంద్రబాబు చుట్టూ తిరుగుతున్నాడు. బుద్ధుందా వర్మా... వాళ్లు మాట నిలబెట్టుకోరని అప్పుడే చెప్పాను కదా. పిఠాపురం వైసీపీ మాజీ ఎమ్మెల్యే దొరబాబు అట... ఈ మధ్యనే జనసేనలో చేరాడు. 

నాకర్థం కావడంలేదు. మీకు బుద్ధి, బుర్ర ఉన్నాయా... ఇదే పవన్ కల్యాణ్, చిరంజీవి 2008లో ప్రజారాజ్యం పార్టీ పెట్టి వందల కోట్లు, వేల కోట్లు వసూలు చేశారని మనందరం విన్నాం... కొందరు సూసైడ్ కూడా చేసుకున్నారు. అదే ప్రజారాజ్యం ఇప్పుడు జనసేనగా ఆవిర్భవించిందని అదే చిరంజీవి చెబుతున్నారు. అంటే దానర్థం ఏమిటి... అదే పాలసీతో వచ్చే ఎన్నికల్లో మళ్లీ మేం వందలు, వేల కోట్లు వసూలు చేస్తాం... మా కుటుంబం మాత్రం పదవులు అనుభవిస్తాం... అంటున్నారు. తెలివైనవాడు ఎవడూ ఆ పార్టీలో చేరడు. మూర్ఖులు మాత్రమే అందులో చేరతారు. 

మళ్లీ జనసేన గానీ, టీడీపీ గానీ గెలుస్తాయా? 9 నెలలకే చాప్టర్ క్లోజ్... అంతా అవినీతిమయం!... అంతటా విఫలమయ్యారని స్పష్టంగా కనిపిస్తోంది కదా. ఈసారి వచ్చేది కేవలం ప్రజాశాంతి పార్టీ మాత్రమే" అని కేఏ పాల్ వ్యాఖ్యానించారు.
KA Paul
SVSN Varma
Pithapuram
Pawan Kalyan
Janasena
TDP

More Telugu News