AP Capital: అమరావతిలో సంస్థలకు భూ కేటాయింపులపై మంత్రుల కమిటీ కీలక నిర్ణయాలు

AP Ministers Committee held meeting on Amaravati land allotments for firms
  • పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ నేతృత్వంలో మంత్రుల కమిటీ సమావేశం
  • అమరావతిలో గతంలో 131 సంస్థలకు భూ కేటాయింపులు
  • అందులో 31 సంస్థలకు కేటాయించిన భూములు కొనసాగిస్తామన్న నారాయణ
ఏపీ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ నేతృత్వంలో నేడు మంత్రుల కమిటీ సమావేశమైంది. దీనిపై మంత్రి నారాయణ స్పందిస్తూ... రాజధాని అమరావతిలో సంస్థలకు భూ కేటాయింపులపై నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. గతంలో 131 సంస్థలకు భూ కేటాయింపులు జరిగాయని వెల్లడించారు. అందులో 31 మందికి కేటాయించిన భూములను కొనసాగిస్తామని వివరించారు. 

రెండు సంస్థలకు కేటాయించిన భూముల లొకేషన్ మార్చామని తెలిపారు. మరో 16 సంస్థలకు కేటాయించిన భూముల లొకేషన్ మార్పు, విస్తరణపై నిర్ణయం తీసుకున్నామని మంత్రి నారాయణ వెల్లడించారు. 13 సంస్థలకు కేటాయించిన భూముల రద్దుకు నిర్ణయించామని అన్నారు. 

గత ప్రభుత్వం కక్ష సాధింపుతో రాజధాని విషయంలో మూడు ముక్కలాట ఆడిందని నారాయణ విమర్శించారు.
AP Capital
Amaravati
Land Allotment
TDP-JanaSena-BJP Alliance

More Telugu News