Muttiah Muralitharan: శ్రీలంక దిగ్గజ స్పిన్నర్ మురళీధరన్‌కు ఉచితంగా భూమి.. జమ్మూకశ్మీర్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్న విపక్షాలు

Jammu and Kashmir government under fire for land given free of cost to ex Sri Lanka cricketer Muralitharan
  • మురళీధరన్ కంపెనీ ‘సిలోన్ బేవరేజెస్‌‘కు కథువా జిల్లాలో 25.75 ఎకరాల భూమి
  • ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా కేటాయించడంపై భగ్గుమన్న విపక్షాలు
  • తమ వద్ద కూడా సమాచారం లేదన్న ప్రభుత్వం
శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్‌కు జమ్మూకశ్మీర్‌లోని కథువా జిల్లాలో ఉచితంగా భూమి కేటాయించడంపై ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. మురళీధరన్‌కు చెందిన ‘సిలోన్ బేవరేజెస్’ కంపెనీకి జమ్మూకశ్మీర్ ప్రభుత్వం 25.75 ఎకరాల భూమిని ఉచితంగా కేటాయించింది. అందులో రూ. 1600 కోట్ల పెట్టుబడితో బాటిల్ ఫిల్లింగ్, అల్యూమినియం క్యాన్ తయారీ యూనిట్ ఏర్పాటు చేయనున్నారు. 

మురళీధరన్ కంపెనీకి ఉచితంగా భూమి కేటాయించిన విషయం వెలుగులోకి రాగానే కాంగ్రెస్, సీపీఎం సహా ప్రతిపక్ష నేతలు ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. ప్రస్తుతం బడ్జెట్ సమావేశాలు జరుగుతుండగా, ప్రశ్నోత్తరాల సమయంలో విపక్ష నేతలు ఈ విషయమై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 

మురళీధరన్ కంపెనీకి ఉచితంగా భూమిని ఎందుకు కేటాయించాల్సి వచ్చిందో చెప్పాలని సీపీఎం ఎమ్మెల్యే ఎంవై తరిగామి డిమాండ్ చేశారు. ఇది చాలా తీవ్రమైన అంశమని కాంగ్రెస్ సభ్యుడు జీఏ మిర్ పేర్కొన్నారు. భారతీయుడు కాని వారికి ఒక్క పైసా కూడా తీసుకోకుండా భూమిని ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. ప్రతిపక్షాల ప్రశ్నలకు వ్యవసాయ మంత్రి జావెద్ అహ్మద్ దార్ బదులిస్తూ.. ఇది రెవెన్యూ విభాగానికి సంబంధించిన అంశమని, తమకు ఎలాంటి సమాచారం లేదని చెప్పారు. విషయం తెలుసుకుంటామని చెప్పారు. 
Muttiah Muralitharan
Sri Lanka
Kathua
Ceylon Beverages

More Telugu News