అమరావతి, శ్రీకాకుళంలో అంతర్జాతీయ విమానాశ్రయాలు!
- రాష్ట్రంలో రెండు అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాలు
- పెట్టుబడుల ఆకర్షణే ప్రభుత్వ లక్ష్యం.
- ఏపీఏడీసీఎల్ ద్వారా నివేదికల సేకరణ.
- బిడ్లు దాఖలుకు 32 వారాల గడువు.
- హైదరాబాద్ అనుభవంతో ప్రభుత్వం నిర్ణయం.
ఆంధ్రప్రదేశ్ విమానాశ్రయ అభివృద్ధి సంస్థ (ఏపీఏడీసీఎల్) సాంకేతిక, ఆర్థిక అంశాలపై నివేదిక కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ విమానాశ్రయాల నిర్మాణం కోసం బిడ్లను ఆహ్వానించి, బిడ్లు దాఖలు చేయడానికి 32 వారాల గడువు ఇచ్చింది. విమానాశ్రయాల వలన కలిగే ప్రయోజనాలు, వాణిజ్య అభివృద్ధి అవకాశాలను అంచనా వేయాలని కోరింది. హైదరాబాద్ విమానాశ్రయం అభివృద్ధి చెందిన తరువాత పెట్టుబడులు పెరిగాయని ప్రభుత్వం గుర్తు చేసింది. అమరావతిలో విమానాశ్రయం లేకపోవడం వల్ల అంతర్జాతీయంగా గుర్తింపు లేదని భావిస్తున్నారు.