Abhishek Mohanti: రిలీవ్ అయి వెళుతున్న కరీంనగర్ సీపీ అభిషేక్ మహంతికి అదిరిపోయే సెండాఫ్... వీడియో ఇదిగో!

Police gives grand send off to Karimnagar CP Abhishek Mohanti
 
తెలంగాణ పోలీస్ విభాగంలో సింగం అని పేరొందిన ఐపీఎస్ అధికారి అభిషేక్ మహంతి కరీంనగర్ పోలీస్ కమిషనర్ గా తనదైన ముద్ర వేశారు. ఎక్కడ పోస్టింగ్ వేసినా నిజాయతీకి మారుపేరులా, అక్రమార్కుల పాలిట సింహస్వప్నంలా వ్యవహరిస్తారని ఆయనకు పేరుంది. తాజాగా ఆయనను తెలంగాణ క్యాడర్ నుంచి రిలీవ్ చేశారు. ఆయన ఏపీలో రిపోర్ట్ చేయాల్సి ఉంది. 

కాగా, కరీంనగర్ నుంచి వెళ్లిపోతున్న అభిషేక్ మహంతికి పోలీస్ సహచరులు గ్రాండ్ గా వీడ్కోలు పలికారు. ఓ పార్టీ ఏర్పాటు చేసిన పోలీసులు... బ్యాక్ గ్రౌండ్ లో గబ్బర్ సింగ్ పాట వస్తుండగా అభిషేక్ మహంతిని తమ భుజాలపై మోస్తూ ఫంక్షన్ హాల్ అంతా కలియదిరిగారు.
Abhishek Mohanti
Police Commissioner
Karimnagar
Telangana
Andhra Pradesh

More Telugu News