Telangana Inter Exams: తెలంగాణలో ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు

Telangana Inter exams started
  • ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు
  • ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా అనుమతించిన అధికారులు
  • ప్రశాంతంగా జరుగుతున్న పరీక్షలు
తెలంగాణలో ఇంటర్ పరీక్షలు మొదలయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. పరీక్షకు ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించేది లేదన్న నిబంధనను ఈసారి తొలగించారు. ఐదు నిమిషాలు అలస్యంగా వచ్చినా విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించారు. చాలా మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు గంట ముందే ఎగ్జామ్ సెంటర్లకు చేరుకున్నారు. విద్యార్థుల హాల్ టికెట్లను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించారు. పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి.
Telangana Inter Exams

More Telugu News