Off Beat News: డబ్బులు రాయాల్సిన చోట అకౌంట్ నంబర్.. వినియోగదారుడి ఖాతాలోకి రూ. 52,314 కోట్లు

A bank employee accidentally transferred Rs 52 crores
     
డబ్బుల సంఖ్య వేయాల్సిన స్థానంలో పొరపాటున అకౌంట్ నంబర్ వేయడంతో ఓ వ్యక్తి ఖాతాలోకి ఏకంగా రూ. 52,314 కోట్లు బదిలీ అయ్యాయి. ఇదెవరో కస్టమర్ చేసిన పనికాదు.. స్వయంగా బ్యాంకు ఉద్యోగి తప్పదంతో ఈ ఘటన చోటుచేసుకుంది. అమెరికన్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకు అయిన సిటీ గ్రూప్‌లో 2023 ఏప్రిల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

కస్టమర్ ఖాతాలో నగదు జమ చేయాల్సిన ఉద్యోగి.. పొరపాటున నగదు మొత్తం వేయాల్సిన చోట అకౌంట్ నంబర్ రాశాడు. అంతే.. ఏకంగా 52,314 కోట్ల రూపాయలు ఖాతాదారుడి అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ అయ్యాయి. అంతేకాదు, దానిని పర్యవేక్షించాల్సిన మరో అధికారి కూడా గుర్తించకుండా ఓకే చెప్పడంతో వేల కోట్ల రూపాయలు వినియోగదారుడి ఖాతాలో జమయ్యాయి. అయితే, ఆ తర్వాత పొరపాటును గుర్తించి పంపిన మొత్తాన్ని వెనక్కి తీసుకున్నారు. దీంతో బ్యాంకు సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.
Off Beat News
International
America
City Group

More Telugu News