Botsa Satyanarayana: రాజధానిపై బొత్స సంచలన వ్యాఖ్యలు

Botsa Satyanaraya comments on AP capital
  • అమరావతి నిర్మాణానికి లక్షల కోట్లు ఖర్చు అవుతుందన్న బొత్స
  • అంత ఖర్చు చేసే స్తోమత తమ ప్రభుత్వానికి లేదని వ్యాఖ్య
  • పార్టీలో చర్చించి రాజధానిపై నిర్ణయం తీసుకుంటామన్న బొత్స
ఏపీ రాజధాని అమరావతి గురించి వైసీపీ నేత బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి నిర్మాణానికి లక్షల కోట్లు ఖర్చు అవుతుందని అన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు లక్షల కోట్లు ఖర్చు చేసే స్తోమత తమకు లేదని... అందుకే మూడు రాజధానుల వైపు మొగ్గు చూపామని తెలిపారు. అందుకే అమరావతిని శ్మశానం అన్నామని... ఆ వ్యాఖ్యల్లో ఎలాంటి వివాదం లేదని చెప్పారు. పార్టీలో చర్చించి రాజధానిపై తమ నిర్ణయం ఏమిటో చెబుతామని అన్నారు. బొత్స చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
Botsa Satyanarayana

More Telugu News