యాదగిరిగుట్టకు వెళుతుండగా కారులో మంటలు... తప్పిన ప్రాణాపాయం

Fire catches in car while going Yadagirigutta
  • గజ్వేల్ నుంచి భువనగిరికి వెళ్లే దారిలో కారులో మంటలు
  • కారులో నుంచి పొగలు రావడం గమనించిన డ్రైవర్
  • కారులో నుంచి ప్రయాణికులు దిగడంతో తప్పిన ముప్పు
యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దర్శనం కోసం యాదగిరిగుట్టకు వెళుతుండగా కారులో మంటలు చెలరేగి, తృటిలో ప్రాణాపాయం తప్పిన ఘటన తెలంగాణలో జరిగింది. గజ్వేల్ నుండి భువనగిరికి వెళ్లే దారిలో ప్రమాదవశాత్తు కారులో మంటలు చెలరేగాయి. తుర్కపల్లి సమీపంలోకి రాగానే కారు ముందు భాగం నుండి పొగలు వచ్చాయి. ఇది గమనించిన డ్రైవర్ ప్రయాణికులను అప్రమత్తం చేశాడు.

వెంటనే అందరూ కారులో నుంచి కిందకు దిగడంతో ముప్పు తప్పింది. కారు మంటల్లో చిక్కుకుంది. ప్రమాదంపై పోలీసులు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. పైరింజన్‌తో ప్రమాదస్థలానికి చేరుకున్న సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ప్రమాదం సమయంలో అటుగా వెళుతున్న ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఘటనా ప్రాంతాన్ని పరిశీలించారు.
Go Back to Shorts
Yadadri Bhuvanagiri District
Car
Fire Accident

More Telugu News