Chicken Mela: చికెన్ మేళాకు ఎగబడిన జనాలు.. ఎక్కడంటే..!

rajahmundry chicken mela non veg lovers flocked to Relish the chicken
  • రాజమండ్రిలో చికెన్ మేళా
  • వివిధ రకాల చికెన్ వంటకాల ఏర్పాటు 
  • ఎగబడి చికెన్ వంటకాలను ఆరగించిన నాన్ వెజ్ ప్రియులు
బర్డ్ ఫ్లూ నేపథ్యంలో ప్రజల్లో నెలకొన్న భయాన్ని, అపోహలను తొలగించేందుకు వివిధ ప్రాంతాల్లో చికెన్ మేళాలను నిర్వహిస్తున్నారు. వీటికి చికెన్ ప్రియుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. తాజాగా రాజమండ్రి ఆజాద్ చౌక్ సెంటర్‌లో చికెన్ హోల్ సేల్ అండ్ రిటైల్ వర్తక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చికెన్ మేళాకు మాంసాహారుల నుంచి విశేష స్పందన లభించింది. చికెన్ వంటకాలను ఆస్వాదించడానికి నాన్ వెజ్ ప్రియులు బారులు తీరారు. ఈ మేళాలో వివిధ రకాల చికెన్ వంటకాలు ఏర్పాటు చేశారు.

వంద డిగ్రీల వేడితో చికెన్ ఉడికించి తినడం వల్ల బర్డ్ ఫ్లూ మనిషికి వచ్చే అవకాశం లేదని తెలియజేసేందుకే ఈ మేళా ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు వెల్లడించారు. బర్డ్ ఫ్లూ భయంతో చికెన్, గుడ్డు అమ్మకాలపై తీవ్ర ప్రభావం చూపిందని, పౌల్ట్రీ రంగానికి అపార నష్టం వాటిల్లిందని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేళాకు ప్రజల నుంచి మంచి స్పందన లభించడం తమకు సంతోషంగా ఉందని తెలిపారు.

బర్డ్ ఫ్లూ భయంతో గత కొన్ని నెలలుగా తెలుగు రాష్ట్రాల్లో జనాలు చికెన్ తినడం మానివేశారు. దీంతో చికెన్ అమ్మకాలు పడిపోయాయి. 
Chicken Mela
Rajahmundry
Bird Flu

More Telugu News