Supreme Court: దిగువ కోర్టుల తీరుపై మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు

supreme court sets aside hc order on compensation for wrongful confinement
  • అలహాబాద్ హైకోర్టు తీర్పును తప్పుబట్టిన సుప్రీంకోర్టు
  • ఒక వ్యక్తి విడుదలైన తర్వాత బెయిల్ దరఖాస్తుకు విలువ ఉండదు
  • న్యాయస్థానాలు పరిధులు దాటుతున్నాయంటూ కీలక వ్యాఖ్య
హైకోర్టుల తీరుపై సర్వోన్నత న్యాయస్థానం మరోసారి అసహనం వ్యక్తం చేసింది. తాము ఎన్నిసార్లు చెబుతున్నా, కోర్టులు అధికార పరిధిని దాటుతున్నాయని, ఇది సరైన విధానం కాదని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో రూ.5 లక్షలు పరిహారం చెల్లించాలని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. 
 
ఈ కేసులో ప్రతివాదిని జిల్లా కోర్టు విడుదల చేసిన తర్వాత ఆ విషయం తెలిసి కూడా హైకోర్టు అతని పెండింగ్ బెయిల్ దరఖాస్తుపై విచారణ జరిపిందని, ఒకసారి వ్యక్తి విడుదలైన తర్వాత బెయిల్ దరఖాస్తుకు విలువ లేదని పేర్కొంది. దాన్ని కొట్టివేయాలని, కోర్టు జోక్యం చేసుకొని అందులో తప్పొప్పులను పరిశీలించి ఉత్తర్వులు జారీ చేయకూడదని జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ మన్మోహన్ ధర్మాసనం పేర్కొంది. 
Supreme Court
Wrongful Confinement
High Court

More Telugu News