Nimmala Rama Naidu: ప్రకాశం జిల్లా ప్రజలకు జగన్ బహిరంగ క్షమాపణ చెప్పాలి: మంత్రి నిమ్మల

Minister Nimmala demands Jagan should apologise Prakasam district people
  • అబద్ధాలు ఆడడంలో వైసీపీ నేతలు తగ్గడంలేదన్న నిమ్మల
  • ప్రజలకు మాయమాటలు చెప్పడంలో పోటీపడుతున్నారని విమర్శలు
  • పూర్తికాని వెలిగొండ ప్రాజెక్టును ఎలా ప్రారంభించారో చెప్పాలని నిలదీత
అధికారం కోల్పోయినా అబద్ధాలు ఆడడంలో వైసీపీ నేతలు ఎక్కడా తగ్గడం లేదని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. ప్రజలకు మాయమాటలు చెప్పేందుకు వైసీపీ నేతలు పోటీపడుతున్నారని ఎద్దేవా చేశారు. 

పూర్తికాని వెలిగొండ ప్రాజెక్టును జగన్ ప్రజలకు ఎలా అంకితం చేశారో చెప్పాలని నిమ్మల నిలదీశారు. పూర్తికాని ప్రాజెక్టును ఆనాడు ఎలా ప్రారంభించారో వైసీపీ నేతలు చెప్పాలని అన్నారు. ప్రకాశం జిల్లా ప్రజలకు జగన్ బహిరంగ క్షమాపణ చెప్పాలని మంత్రి నిమ్మల డిమాండ్ చేశారు. 2026 జులై నాటికి వెలిగొండ రిజర్వాయర్ ను నింపుతామని స్పష్టం చేశారు.
Nimmala Rama Naidu
Jagan
Veligonda Project
Prakasam District

More Telugu News