Daggubati Venkateswara Rao: చాలాకాలం తర్వాత చంద్రబాబు ఇంటికి వెళ్లిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు

Daggubati Venkateswara Rao meets Chandrababu after long time
  • ‘ప్రపంచ చరిత్ర’ పుస్తకాన్ని రాసిన దగ్గుబాటి
  • మార్చి 6న విశాఖపట్నంలో ఆవిష్కరణ
  • రావాల్సిందిగా చంద్రబాబుకు ఆహ్వానం
తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు సుదీర్ఘకాలం తర్వాత కలిశారు. నిన్న ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన దగ్గుబాటి తాను రాసిన ‘ప్రపంచ చరిత్ర’ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి రావాల్సిందిగా చంద్రబాబును ఆహ్వానించారు. 

కుటుంబ కార్యక్రమాల్లో చంద్రబాబు, దగ్గుబాటి కలుసుకుంటున్నా చంద్రబాబు నివాసానికి దగ్గుబాటి రావడం సుదీర్ఘ కాలం తర్వాత ఇదే తొలిసారి. కాగా, దగ్గుబాటి పుస్తకావిష్కరణ కార్యక్రమానికి కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా హాజరు కానున్నారు. కాగా, మార్చి 6న విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీ ఆడిటోరియంలో ఉదయం 10.30 గంటలకు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించనున్నారు.
Daggubati Venkateswara Rao
Chandrababu
Prapancha Charitra

More Telugu News