Congress: మాతో 32 మంది ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు... సీఎం బీజేపీతో టచ్‌లో ఉన్నారు: పంజాబ్ కాంగ్రెస్ నేత

Punjab Congress Claims 32 AAP MLAs Ready To Switch Sides Leader Of Opposition Partap Singh Bajwa
  • మంత్రులు కూడా టచ్‌లో ఉన్నారన్న పంజాబ్ కాంగ్రెస్ నేత ప్రతాప్ సింగ్ బజ్వా
  • కేజ్రీవాల్ తొలగిస్తే భగవంత్ మాన్ బీజేపీలోకి వెళతారని జోస్యం
  • ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ చీఫ్‌కు ఈ విషయం తెలుసని వ్యాఖ్య
తనతో 32 మంది ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని పంజాబ్ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ప్రతాప్ సింగ్ బజ్వా అన్నారు. వారిలో కొందరు మంత్రులు కూడా ఉన్నారని వెల్లడించారు. 

పంజాబ్ లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా, ప్రతాప్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన 32 మంది తనతో సంప్రదింపులు జరుపుతున్నారని, మరికొంతమంది బీజేపీతోనూ టచ్‌లో ఉండే అవకాశముందని వ్యాఖ్యానించారు.

ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజాప్రతినిధులు తమతో టచ్‌లో ఉన్న విషయం ఆ పార్టీ పంజాబ్ చీఫ్ అమన్ బరోడాకు కూడా తెలుసని వ్యాఖ్యానించారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలందరికీ ఇదే చివరి అవకాశమని అర్థమైందని ఆయన అన్నారు. అందుకే వారు టిక్కెట్ల కోసం కొత్త పార్టీల వైపు చూస్తున్నారని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూడా బీజేపీతో టచ్‌లో ఉన్నారని వ్యాఖ్యానించారు.

కేజ్రీవాల్ ఆయనను ముఖ్యమంత్రి పదవి నుండి తొలగిస్తే బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ తప్పుడు ప్రకటనలు చేయలేదని కూడా ప్రతాప్ సింగ్ బజ్వా అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని పడగొట్టే ఉద్దేశం తమకు లేదని ఇదివరకు కూడా చెప్పామని పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ఆలోచన కూడా లేదని ఆయన అన్నారు. ఆ పని బీజేపీయే చేస్తుందని ఆరోపించారు.
Congress
BJP
AAP
Punjab

More Telugu News